Wednesday, January 22, 2025

రూ.10 కోట్లకు రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు: కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు కూడా చెప్పారని, సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతానని మనోహర్ రెడ్డి, రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు పలు పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరికలతో పాత నేతలు ఆందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ హామీతోనే పలువురు పేరున్న నాయకులు పార్టీలో చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండడంతో తమకు టికెట్లు వస్తాయో రావోనని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News