Monday, December 23, 2024

రాహుల్‌కు పాస్‌పోర్టు జారీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మూడేళ్ల కాలపరిమితితో కూడిన పాస్‌పోర్టు జారీ చేశారు. సోమవారం నుంచి రాహుల్ ఆరురోజుల అమెరికా పర్యటనకు వెళ్లుతున్నారు. సాధారణంగా ఇచ్చే పది సంవత్సరాల పాస్‌పోర్టు బదులు మూడేళ్ల పాస్‌పోర్టు ఇచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ కోర్టు అనుమతిని ఇవ్వడంతో రాహుల్‌కు పాస్‌పోర్టు జారీకి మార్గం ఏర్పడింది. పరువు నష్టం దావా కేసులో ఎంపిగా అనర్హతకు గురి కావడంతో రాహుల్ ఇప్పటికే తమ దౌత్యపరమైన పాస్‌పోర్టును అధికారులకు అప్పగించారు.

తాను అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున పాస్‌పోర్టు ఇవ్వాలని రాహుల్ గాంధీ అభ్యర్థించారు. దీని మేరకు ఆయనకు పాస్‌పోర్టు దక్కింది. రాహుల్ వాషింగ్టన్ డిసిలో , న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలలో వర్శిటీ విద్యార్థులతో ఇష్టాగోష్టి సమావేశం జరుపుతారు. అక్కడి భారతీయ అమెరికన్లతో, చట్టసభ సభ్యులతో , విశ్లేషణల వేదికల వారితో , వాల్‌స్ట్రీట్‌అధికారులతో ముచ్చటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News