Friday, November 22, 2024

షారూక్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ సంఘీభావం

- Advertisement -
- Advertisement -

Congress leader Rahul's solidarity with Shah Rukh Khan

దేశం మీకు అండగా ఉంటుందంటూ లేఖ

న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్ జైలులో ఉన్నపుడు ఆయన తండ్రి, బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్‌కు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లేఖ రాసినట్టు వెల్లడైంది. అక్టోబర్ 14న రాహుల్ లేఖ రాసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశం యావత్తూ మీకు అండగా ఉంటుందని షారూక్‌కు ఆ లేఖలో రాహుల్ భరోసా ఇచ్చారు. ఆర్యన్‌ను జైలుకు పంపిన ఆరు రోజులకు రాహుల్ లేఖ రాశారు. షారూక్‌కు మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్‌సిపి కూడా మద్దతుగా నిలిచాయి. బాలీవుడ్‌లోని ప్రముఖుల నుంచి కూడా షారూక్ కుటుంబం పట్ల సంఘీభావం వ్యక్తమైంది. షారూక్‌కు సంఘీభావం తెలిపినవారిలో సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్, నిర్మాత ఫరాఖాన్ ఉన్నారు. బాంబే హైకోర్టు అక్టోబర్ 28న ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజున ఆర్యన్ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. దాంతో, షారూక్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సమయంలో ఆర్యన్ వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు లేకపోవడం బెయిల్‌కు వీలు కల్పించింది. వాట్సాప్ సందేశాల ఆధారంగా ఆర్యన్‌కు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధమున్నదని దర్యాప్తు సంస్థ ఎన్‌సిబి కోర్టుకు తెలపడం గమనార్హం. అలాగని నిర్ధారణకు రాలేమంటూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News