Monday, January 20, 2025

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరారు. అలాగే చండూరు ఎంపిపిగా కొనసాగుతున్న ఆయన భార్య కళ్యాణి కూడా టిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం వారిద్దరు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వారిని పార్టీలోకి కెటిఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఉద్యమ కాలం నుంచి పల్లె రవి టిఆర్‌ఎస్‌తో కలిసి పని చేశారని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరమైన ఆయన మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. మునుగోడులో పార్టీస్ విజయానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. పార్టీకి వచ్చిన పల్లె రవికి భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను కల్పిస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు.
తదనంతరం పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు తెలియజేశానన్నారు. అందుకు ఆయనసానుకూలంగా స్పందించారన్నారు. ప్రజల కోరికను తీర్చుతామని హామి లభించిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో వీడి టిఆర్‌ఎస్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు కోసం తమ వంతు కృషిని చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టిఆర్‌ఎస్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.

Congress Leader Ravi Kumar Goud joins TRS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News