Thursday, January 23, 2025

శ్రీనగర్ కు విచ్చేసిన సోనియా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత సందర్శన కోసం శనివారం శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనగరలో కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వనీ తదితర సీనియర్ నేతలు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో మాట్లాడిన తరువాత నిగీన్ సరస్సును సందర్శించి బోటులో షికారు చేశారు. సోనియా తనయుడు, ఎంపీ రాహుల్ గాంధీ లద్దాఖ్‌లో వారం రోజులపాటు పర్యటన కోసం శుక్రవారమే ఇక్కడకు వచ్చారు. కుటుంబం అంతా రైన్‌వారి ఏరియా హోటల్‌లో బస చేస్తారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా వీరిని కలుసుకోడానికి రానున్నారు. కుటుంబమంతా ఆదివారం గుల్మార్గ్ సందర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు ఉండబోవని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News