Saturday, April 5, 2025

కాంగ్రెస్‌కు సునీల్ జాఖఢ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ పదవులన్నిటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిపిసిసి) మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖఢ్ శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుడ్ లక్ అండ్ గుడ్‌బై కాంగ్రెస్ అంటూ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల చింతన్ శిబిర్ నిర్వహిస్తున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇది తన వీడ్కోలు బహుమతని పేర్కొంటూ గుడ్ లక్ అడ్ గుడ్‌బై కాంగ్రెస్ అని పార్టీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాలడ్డారని ఆరోపిస్తూ అధిష్టానం తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఆయన గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News