Thursday, January 23, 2025

మర్రి చెన్నారెడ్డికి నివాళులు

- Advertisement -
- Advertisement -

Congress leader tribute to Marri Chennareddy

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ సిఎం, మాజీ గవర్నర్ చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాందెండ్ల భాస్కరరావు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు అంజన్‌కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపి వి.హనుమంతరావు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. నిరుద్యోగ యువత మహిళలను కూడగట్టుకుని మంచి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందించడమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. యూపిలో ప్రియాంకగాంధీ మహిళలకు 40 శాతం సీటుల కేటాయించడంతో మహిళల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News