Monday, December 23, 2024

పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి: వంశీకృష్ణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రంలో లోతట్టు ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు, ఆదివాసుల పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిసిసి అధ్యక్షుడు వంశీకృష్ణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 5 వరకు విడతల వారిగా వినూత్న రీతిలో ధర్నాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా బుధవారం అచ్చంపేట పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీక్షా కార్యక్రమానికి ఇంచార్జి ఏనుగు జంగారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్సి రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఉప్పునుంతల మండల అధ్యక్షుడు రాజు రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మెన్ వై. శ్రీనివాసులు, మాజీ ఎంపిపి రామనాథం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, అచ్చంపేట మండల అధ్యక్షుడు నరసయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News