Sunday, January 19, 2025

కాంగ్రెస్ నాయకులవి పగటి కలలు

- Advertisement -
- Advertisement -
ఖమ్మం సభ జనగర్జన కాదు కుటుంబ గర్జన: కెఏ పాల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీకి బలం పెరిగిందని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షు లు కెఏ పాల్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఖ మ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సభ ’జన గర్జన’ కాదని, కుల గర్జన, స్వార్థ గర్జన, కుటుంబ గర్జన, రెడ్డి గర్జన, అవినీతి, అక్రమ గర్జన అని విమర్శించారు. ఈ సభకు ఖర్చు పెట్టడానికి పొంగులేటికి వంద కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పొంగులేటిపై సీబీఐ విచారణ చేయాలని చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పార్టీ పెట్టి మళ్లీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. గద్దర్ ’బానిసలారా బయటికి రండి’ అంటూ గద్దర్ పాట రాశారని, కానీ నేడు గద్దరే బానిస లాగా అయ్యారని, అలాంటి వారే బానిస అ యితే ఇంకా ఏం చెప్పాలన్నారు. కుటుంబ పాలన కుల పాలన అంతం చే యాలంటే అంబేద్కర్ పూలే ఆశయాలను నెరవేర్చాలంటే అవినీతి పాలనకు, రెడ్డి పాలన రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. 54 ఏళ్ల గాంధీ కుటుంబ పాలనలో అవినీతి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News