Tuesday, November 5, 2024

గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి.. తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం గుర్రపు బగ్గీపై అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. గుర్రపుబగ్గీపైనే లోనికి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను, ఎంఎల్‌సిని పోలీసులు అనుమతించలేదు. దాంతో వారు అక్కడ నిరసనకు దిగారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి నారాయణగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రపు బగ్గీపై వారు కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ నుంచి గుర్రపు బగ్గీపై ర్యాలీకి బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే పోలీసులు లోనికి వెళ్లనీయలేదు. దాంతో వారు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనని జీవన్‌రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోతుఆన్నరని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ భారత్ బంద్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లోని కోఠి సెంటర్ వద్ద ధర్నాకు దిగిన వామపక్షాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాన ఆర్టిసిలో మాత్రం బంద్ ప్రభావం కనిపించడ లేదు. బస్సులు యధావిధిగా నడిచాయి. ట్రాఫిక్‌కు కూడా పెద్దగా అంతరాయం కలుగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News