Monday, January 20, 2025

కాసిపేటలో ఈటల దిష్టిబొమ్మ దహనం 

- Advertisement -
- Advertisement -

కాసిపేటః పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ దిష్టి బొమ్మను ఆదివారం కాసిపేట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో దహనం చేశారు. హూజురాబాద్ బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తు యూత్ కాంగ్రేస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆదేశాల మేరకు ఈటెల దిష్టిబొమ్మను దహనం చేశారు.

Also Read: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్…. అసలు ఏం జరిగింది…

ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రదాన కార్యాదర్శి రత్నం ప్రదీఫ్ మాట్లాడుతూ.. అధికార పార్టీతో తెగదెంపులు చేసుకున్న ఈటల రాజేందర్ అధికార పార్టీ పై ప్రేమతో ప్రతి పక్ష పార్టీ నేతపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ లో చేరేందుకు మార్గం సుగమనం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలపై బురద చల్లే ప్రయత్నాలు ఈటల చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

రేవంత్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన ఈటల బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో మూత్ కాంగ్రేస్ నాయకులు గుండా రాజ్‌కుమార్, సల్లూరి సమీల్‌కుమార్, వెంకటేష్, రత్నం సాయి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News