Sunday, February 23, 2025

అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరు

- Advertisement -
- Advertisement -

వరంగల్‌లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయం
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరని పోలీసులపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వరంగల్ నగరం అల్లకల్లోలం అయ్యిందని ఒక్క పైసా నష్టపరిహారం, నష్ట నివారణ కార్యక్రమాలను చేపట్టలేదని అందులో భాగంగానే కాంగ్రెస్ సోమవారం గ్రేటర్ వరంగల్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జీడబ్ల్యూఎంసి వద్ద నిరసన చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారని, ఇది అన్యాయమని ఆయన పేర్కొన్నారు. వరంగల్ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టుల తీరును ఈ సందర్భంగా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టును ఆయన ఖండించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి వారితో కార్పొరేషన్ అధికారులు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News