Monday, December 23, 2024

నెహ్రూ ఫోటోతో కాంగ్రెస్ నేతల ప్రొఫైల్ పిక్

- Advertisement -
- Advertisement -

Congress leaders change social media display

ప్రధాని పిలుపునకు రాహుల్ కౌంటర్

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని పెట్టుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతోసహా పలువురు కాంగ్రెస్ నాయకులు తమ ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఫోటోను మార్చుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్, పవాన్ ఖేరా, సుప్రియా శ్రీనాథ్ తదితరులు చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న జవహర్‌లాల్ నెహ్రూ చిత్రాన్ని తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్ పిక్‌గా ఏర్పాటు చేసుకున్నారు. మన త్రివర్ణ పతాకం మన దేశానికి గర్వకారణమని, ఈ జెండా ప్రతి భారతీయుడి గుండెల్లో ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. నెహ్రూ ఫోటోతో తన సోషల్ మీడియా ఖాతాలను మార్చుకున్న జైరాం రమేష్ మాత్రం ప్రధాని మోడీపై ఘాటైన వ్యాఖ్యలు ట్వీట్ చేశారు. నాగపూర్‌లోని తన (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో 52 సంవత్సరాల పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేయని సంస్థ ఇప్పుడు ప్రధాని పిలుపునకు స్పందించి తన సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News