Tuesday, April 8, 2025

దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Congress leaders comments on Modi

హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, అలాంటి వారు బిజెపిలో ఉన్నారా అని కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ జాతీయ నేత, ఎంపి రాహుల్ గాంధీ ఇడి ముందు రెండో రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, భట్టి మీడియాతో మాట్లాడారు. బ్యాంకులను లూటీ చేసిన వారంతా బిజెపిలోనే ఉన్నారని చురకలంటించారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన ఆస్తులో ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకునే హక్కు లేదన్నారు. బిజెపి కావాలనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన చరిత్ర వారి కుటుంబానిది అని ప్రశంసించారు. రాహుల్‌ను ఇడి విచారిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News