మహబూబాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్‌ఎస్ బాల్క సుమన్‌పై మహబూబాబాద్ పోలీసు స్టేషన్‌లో పీర్యాదు చేశారు. సుమన్‌ను ప్రేరేపిస్తున్న బీఆర్‌స్ నేత కేటీఆర్ దిష్టిబొమ్మను మంగళవారం అర్భన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ఘనపురపు అంజయ్య నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. స్థానిక నెహ్రూసెంటర్‌లో డిసిసి అద్యక్షులు జెన్నారెడ్డి భరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్‌ల అదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని అర్భన్ అద్యక్షులు ఘనపురపు అంజయ్య తెలిపారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలులు కాకముందే బిఆర్‌ఎస్ నాయకులు ఇష్టానుసారంగా నోటి కొచ్చినట్లు మాట్లాడడం ప్రజాస్వామ్యంలో సరైన చర్య కాదన్నారు.
ఇలాంటి చౌకబారు మాటలతో తమ పార్టీ నేతలను ఎవరినైనా అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరని హెచ్చరించారు. బాల్క సుమన్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌లు బహిరంగా క్షమాపనలు చేప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టౌన్ పోలీసు స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయాలని సీఐ రమేశ్‌కు పీర్యాదు చేశారు. మాజీ జెడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు పిండ్రాల రాందాసు, గునిగంటి కమలాకర్, విజయలక్ష్మీ, రాంశెట్టి విరేందర్, సిరిపు రం వీరు, శంతన్ రామరాజు, బండారి చిరంజీవి, విష్ణ, నరేస్ రెడ్డి, సురేంద్రాచారి, బానోత్ ప్రసాద్ నాయక్, రవి, నీరుటి లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీను, డాన్ శ్రీను, నజీర్, నెమ్మది సుదర్శన్, విట్టు పాల్గొన్నారు.