Thursday, January 23, 2025

‘బాల్కసుమన్ నోరు అదుపులో పెట్టుకో’…..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నిరసనలు కొనసాగుతున్నాయి. బాల్కసుమన్ దిష్టిబొమ్మకు కాంగ్రెస్ నేతలు చెప్పుల దండలతో ఊరేగించిన అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. బాల్కసుమన్ కామెంట్స్‌కు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ కౌంటర్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ నేతలు ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని వివేక్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడినా బిఆర్‌ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదని చురకలంటించారు. బాల్కసుమన్ కామెంట్స్‌ను వినోద్ ఖండించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. బాల్కసుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రేమ్‌సాగర్ వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాలలో బాల్కసుమన్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News