Monday, December 23, 2024

జడ్పి చైర్‌పర్సన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

- Advertisement -
- Advertisement -

కాటారం : నాలుగేండ్ల కాలంలో పక్కనున్న పెద్దపల్లి జిల్లాలో తిరిగి జడ్పిటిసిగా కాటారం మండలం నుండి జడ్పిటిసిగా గెలిచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై కాటారం మండలానికి, జిల్లాలో ఏమీ అభివృద్ధి చేయకుండా ప్రజల్లో ఉనికి కోల్పోయిని జడ్పి చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణిరాకేష్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉనికి కోసమే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్‌వాడ గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత దుద్దిళ్ళ కుటుంబానిదేనని, శ్రీధర్‌బాబు విప్‌గా,మంత్రిగా ఉన్న సమయంలో తన పక్కన ఉండి అవినీతి చేసి శ్రీధర్‌బాబుకు వెన్నుపోటు పొడిచిన నాయకులు ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగిందని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ధన్‌వాడ గ్రామంలో భూమిలేని నిరుపేదలకు తమ భూములను విరాళంగా ఇచ్చిన ఘనత దుద్దిళ్ళ కుటుంబానికిది అని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది యేళ్ళ కాలంలో జెడ్పీ చైర్‌పర్సన్‌గా నాలుగేళ్ళలో కాటారం మండలానికి చేసిందేమిటని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సిట్ విచారణ చేపట్టిన కేసీఆర్ విచారణ జరిపితె బిఆర్‌ఎస్ నాయకులే జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని కేసును పక్కన పెట్టారని అన్నారు. భూపాలపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఉండి పక్క జిల్లా జెడ్పీ చైర్మన్‌కు పత్తాసు పలుకుతూ జెడ్పీటీసీగా గెలిపి ంచిన కాటారం మండల ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జెడ్పీ చైర్‌ప ర్సన్‌గా గెలిచినప్పటి నుండి స్థానికంగా ఉన్న చరిత్ర లేదని, మండల అభివృద్ధ్దికి కృషి చేయకుండా కలం గడుపుతూ ఎన్నికలు సమీపిస్తుంటే ప్రజల్లోకి వెళ్లి చేసిన అభివృద్ధి చెప్పుకోలేక శ్రీధర్‌బాబుపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

నాలుగేళ్ళ కాలంలోనే మీ నాయకుడు పుట్ట మధూకర్ మంథని రాజగృహ, లగ్జరీ కారు, వెంకటాపూర్‌లో డ్బ్బై ఎకరాల ఫాంహౌస్, చేపల చెరువు ఎక్కడ నుండి వచ్చాయో ప్రజలకు వివరించాలని అన్నారు. శ్రీధర్‌బాబు విలువలతో కూడిన రాజకీయం చేస్తారని మీలా చిల్లర విమర్శలు చేయడం ఆయన నైజం కాదన్నారు.

ఇక ముందు దుద్దిళ్ళ వారిపై పనికి మాలిన విమర్శలు చేస్తే ఊరుకునేదిలేదన్నారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ కాటారం మండల అధ్యక్షుడు చీమల సందీప్, డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న, మంథని నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ కారెంగల తిరుపతిగౌడ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వంశివర్ధన్‌రావు, ధన్‌వాడ సర్పంచ్ జంగిలి నరేష్, ఎంపీటీసీ బోడ మమత నరేష్, శంకరాంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్, నాయకులు కుమ్మరి అశోక్, కుంభం రమేష్‌రెడ్డి, బోడ శ్రీధర్, చీటూరి మహేష్‌గౌడ్, బోగె రాజేందర్, చీకట్ల బాలరాజు, మేడిపల్లి కిరణ్, తుల్సెగారి రమేష్, బొడిగె రాజవీరు, మార్క రవి, దాతు రవి, బద్ది రాజేందర్, రామకృష్ణ, జంగిలి సురేష్, పుట్ట శ్రీకాంత్, పసుల రమేష్, ముక్కెర రెవన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News