Sunday, December 22, 2024

ట్విట్టర్ టిల్లు ఉలిక్కిపడ్డారు..కెటిఆర్‌పై కాంగ్రెస్ శ్రేణుల ఫైర్

- Advertisement -
- Advertisement -

‘ట్విట్టర్ టిల్లు ఉలిక్కిపడ్డారని’ కాంగ్రెస్ శ్రేణులు బిఆర్‌ఎస్ నేత కెటిఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బొగ్గు గనుల వేలంపై మాజీ మంత్రి కెటిఆర్ బిజెపి, కాంగ్రెస్ పార్టీలను విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో స్పందించాయి. ‘సింగరేణిని ఫణంగా పెట్టి తనకు అనుయాయులైన రెండు కంపెనీలకు బొగ్గు గనులను కెసిఆర్ ధారాదత్తం చేశాడా? లేదా, టిల్లు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2022 అక్టోబర్‌లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్‌ను అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇది కెసిఆర్‌కు అత్యంత సన్నిహితులైన అరబిందో సంస్థకు చెందినది) 2023 ఆగస్టులో జరిగిన వేలంలో సత్తుపల్లి బ్లాక్‌ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకున్నాయని (ఇది కెసిఆర్‌కు బంధువైన ప్రతిమ శ్రీనివాస్‌కు చెందినదని) దీని వెనుక గూడుపుఠాణి ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా కెటిఆర్‌కు కాంగ్రెస్ నాయకులు ట్యాగ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News