Thursday, January 23, 2025

17నుంచి రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు

- Advertisement -
- Advertisement -

వారం పాటు హైదరాబాద్‌లో మకాం

ఎఐసిసి చీఫ్ ఖర్తే,  రాహుల్, ప్రియాంకతో బహిరంగ సభలకు సన్నాహాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ఏఐసిసి అగ్రనేతలు ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. అదే రోజున పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు ఉంటాయి. ఈ రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనలు సైతం ఖరారు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 20వ తేదీ తరువాత వారం రోజుల పాటు ఢిల్లీ నుంచి అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని హస్తం పార్టీ అగ్రనేతలతో మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ స్థాయి నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం తుది దశకు చేరుకోనుంది. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రెండు హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంది. ఒకే రోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్లను వినియోగించుకోవాలని కాంగ్రెస్ వర్గాలు నిర్ణయించాయి. దీంతోపాటు అగ్రనేతలు వారం రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులును అంచనా వేసి దానికి తగ్గట్టుగా వ్యూహాలను రూపొందించనున్నారు.

ప్రతి నియోజకవర్గంలో విఐపి పర్యటనలు
ప్రతి నియోజకవర్గంలో విఐపి పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17వ తేదీ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పర్యటనలు ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ఏఐసిసి పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసిసి ప్రత్యేక పరిశీలకులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే ఇకపై జరిగేది అత్యంత కీలకమని దానికి రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉండాలని, కావాల్సిన వసతులను సమకూర్చుకోవాలని ఆయన రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు. ప్రచారాన్ని మరింత సమర్థంగా నిర్వహించేలా ముందుకెళ్లేలా ఎప్పటికప్పుడు వారికి ఆయన దిశా,నిర్ధేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు సైతం రేవంత్‌రెడ్డి సైతం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు వంటి అంశాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ దిశగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News