కాల్వశ్రీరాంపూర్: రైతులను గోస పెడుతూ, భయబ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులకు దేవుడు ఇప్పటికైనా మంచి బుద్ది ప్రసాదించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో మీర్జంపేట, కిష్టంపేట, తారుపల్లి, మొట్లపల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పి, ముక్కు భూమికి రాయాలన్నారు. మూడు పంటలకు నీళ్లు ఇస్తుంటే, మూడు గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడటం వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు. రైతులను గోస పెట్టే కాంగ్రెస్ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు.
కాంగ్రెస్ వాళ్లు ఊరిలోకి వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలోనే నాలుగున్నర లక్షల కోట్లను ఖర్చు చేసి సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు. మూడు పంటల తెలంగాణ కావాలో… మూడు గంటల కాంగ్రెస్ పార్టీ కావాలో రైతులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, రైతుసమితి మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, ఫ్యాక్స్ చైర్మన్‌లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి, కన్వీనర్‌లు నరెడ్ల సదానందం, గొడుగు మల్లేష్, బోయిని సదయ్య, సర్పంచ్ కాసర్ల తిరుపతిరెడ్డి, నాగర్జున్‌రావు,
గోనె శ్యామ్, బైరం రమేష్, ఎంపీటీసీ కౌసల్య శంకర్, ఉపసర్పంచ్‌లు పల్లెర్ల రమేష్, మల్లేష్, గ్రామ అధ్యక్షుడుగాదర్ల రవి, అనవేన సురేష్, కల్వల కిషన్ రెడ్డి, మూడెత్తుల శ్రీనివాస్, రైతు సమితి గ్రామ కోఆర్డినేటర్లు దానవేన రవి, ఉయ్యాల ఓదెలు, బొమ్మ శ్రీనివాస్, ఈర్ల శంకర్, సర్పంచ్‌లు ఆడేపు శ్రీదేవి రాజు, బండ రవీందర్ రెడ్డి, నరేందర్, ఎంపీటీసీలు సువర్ణ చంద్రు, మాజీ సర్పంచ్‌లు కొమురయ్య, రాజయ్య, ఉపసర్పంచ్ కరుణాకర్‌రావు, ఫ్యాక్స్ డైరెక్టర్ మ్యాదరి సదయ్య, కూకట్ల నవీన్, మ్యాడగోని తిరుపతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.