Saturday, February 22, 2025

ముందే ఓటమిని ఒప్పుకున్న కాంగ్రెస్: నడ్డా

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చర్చలలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ ఎన్నికలలో ఓటమిని ఆ పార్టీ ముందుగానే నిర్దంద్వంగా అంగీకరించినట్లేనని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సబ ఎన్నికలలో తాము ఓడిపోయామని కాంగ్రెస్ పార్టీ ముందుగానే అంగీకరించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు తమకు అనుకూలంగా రావని ఊహిస్తే పక్కకు తప్పుకోవడం కాంగ్రెస్‌కు అలవాటేనని ఆయన విమర్శించారు. ఈ కారణంగా ఏడవ, చివరి దశ ఎన్నికలలో ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేసి తమ ఓట్లను వృథా చేసుకోవద్దని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News