Sunday, January 19, 2025

అభివృద్ధి మాది… మత ఘర్షణలు వారివి

- Advertisement -
- Advertisement -

Congress Leaders join TRS in Mahabubnagar

టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హనుమాన్ పుర మెహరున్నిసా మజీద్ సమీపంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీలోకి చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు అన్వర్ తో సహా పి.పాండు, రహీం, బషీర్ సహా పలువురు మహిళలు సహా సుమారు 200 మంది అధికార పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు… మహబూబ్ నగర్ పట్టణంలో కొందరు మత ఘర్షణలను చోటు చేసుకోవాలని కోరుకుంటున్నారని, ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండటం వారికి ఇష్టం లేదని మంత్రి తెలిపారు. పార్టీలకతీతంగా పట్టణాన్ని ప్రశాంతంగా ఉండేలా చూసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలది పదవులు కూడా అమ్ముకున్న సంస్కృతిని కానీ టిఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికే పదవులు వరిస్తాయన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలని ఆయన కోరారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ లోని హనుమాన్ పుర, పాత పాలమూరు వీరన్నపేట గణేష్ నగర్ లాంటి ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అనేక కష్టాలు పడ్డారని దాంతో మిగతా సమస్యలను ప్రశ్నించడం కూడా మానేశారని తెలిపారు. 70 ఏళ్లుగా అధికారం అనుభవించిన నాయకులు స్థానిక సమస్యలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాగునీరు, విద్య, వైద్యంతో సహా సమస్యలన్నిటినీ తీర్చడంతో ప్రజలకు ప్రభుత్వంపై భరోసా ఏర్పడిందన్నారు.

Congress Leaders join TRS in Mahabubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News