Sunday, December 22, 2024

రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించే కుట్ర: కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ కు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్ లు సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుబంధు నిధులను గుత్తేదార్లకు చెల్లించకుండా చూడాలని.. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని కాంగ్రెస్ నేతలు వికాస్ రాజ్ ను కోరారు.

కాగా, నవంబర్ 30న జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీనే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News