Sunday, December 22, 2024

రేణుకా చౌదరి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ.. ఆ చర్చ కోసమే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీకాంగ్రెస్ నేతలు నిరుద్యోగ నిరసన దీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతుల గురువారం రేణుకా చౌదరి నివాసంలో బేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్, గడ్డం ప్రసాద్, సురేష్ షట్కర్ పాల్గొన్నారు. ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ బహిరంగ సభపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను గురువారం ప్రకటించింది. ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే 1న రంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ నిరసన దీక్షలను నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News