Friday, November 22, 2024

నేడు బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నేతల సమావేశం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ

హైదరాబాద్ : గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రాన్నేలుతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రవాప్తంగా నిరసనలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎఐసిసి ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు, ఎంపి రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎఐసిసి కార్యదర్శులు, వివిధ కమిటీల చైర్మన్లు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, టిపిసిసి కార్యవర్గం, డిసిసిల సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు.

ప్రకటన.. స్క్రోలింగ్స్

గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ, రేపు అనగా ఆగష్టు 12, శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు బోయినపల్లిలో గల గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు రేపటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించనున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రేపు బోయినపల్లిలో జరిగే కార్యక్రమానికి హాజరు కాగలరని మనవి.

ధన్యవాదాలు

మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, (ఇంచార్జ్ ఆర్గనైజేషన్)

మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు

రేపు 12వ తేదీ (శనివారం నాడు) సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార కార్యక్రమం ప్రారంభం. కొంపల్లిలోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ఉంది.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి ఎంపీ, సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కీ లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, చైర్మన్ లు సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News