Saturday, December 28, 2024

అలిగిన విహెచ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గాంధీభవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఇందుకు మరోసారి వేదికగా నిలిచింది. కొత్త ఇంఛార్జి ముందే నేతల మధ్య రచ్చ జరిగింది. సీనియర్ నేత వి.హనుమంతరావు(విహెచ్), వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గాంధీభవన్ నుంచి విహెచ్ బయటకు వెళ్లిపోయారు. క్రికెట్ టోర్నమెంట్‌కు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు థాక్రేను ఆహ్వానించేందుకు విహెచ్ గాంధీభవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో మహేష్‌గౌడ్, విహెచ్ మధ్య గొడవ జరిగింది.

క్రికెట్ టోర్నమెంట్‌కు మాణిక్‌రావు థాక్రేను విహెచ్ ఆహ్వానించగా 22వ తేదీన ఇంఛార్జి షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్‌గౌడ్ బదులిచ్చారు. దీంతో ఇంఛార్జి వస్తానంటే నువ్వెందుకు అభ్యంతరం చెబుతున్నావంటూ విహెచ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆపై బయటకు వచ్చేసిన విహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ‘ఈ కార్యక్రమం పిసిసి ప్రెసిడెంట్ పెట్టలేదని, తాను పెట్టానని మహేష్‌గౌడ్ తనతో అన్నాడని, పిసిసి ప్రెసిడెంట్‌కి లేని అభ్యంతరం అతనికి ఎందుకు? అని ‘ఎవరికి వారే ఇక్కడ లీడర్’ ఉన్నారంటూ తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి విహెచ్ అలిగి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News