Monday, December 23, 2024

నెహ్రూకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని పండిత్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు, నెహ్రూ ముని మనుమడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. శాంతి వన్ స్మారకం వద్ద ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ కోశాధికారి పవన్ బన్సల్, ఇతర పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ‘వారసత్వం ఓ దీపస్థంభంలా నిలువుగా నిలబడి ఉంది, భారత భావన, దాని విలువలను ప్రకాశింపజేస్తోంది.అందుకు ఆయన(నెహ్రూ) జీవితాన్ని అంకితం చేశారు’ అన్నారు.

నెహ్రూను గుర్తుచేసుకున్న ఖర్గే ట్విట్టర్‌లో ‘గోడల మీద పటాలను మార్చడం ద్వారా మీరు చరిత్ర గతిని మార్చలేరు’ అని రాశారు. ‘నెహ్రూ సేవలు లేకుండా 21 శతాబ్ది భారత్‌ను ఊహించలేము. నిర్భయంగా ఆయన ప్రజాస్వామ్య విలువను కాపాడారు. సవాళ్లు ఉన్నప్పటికీ ఆయన అభ్యుదయ భావాలు భారత్‌ను ఆర్థిక, రాజకీయంగా ఎదిగేలా చేశాయి. హింద్‌కు చెందిన జవహర్‌కు నా నివాళులు’ అని కూడా ఖర్గే రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News