Saturday, December 21, 2024

ఇందిరాగాంధీ 106 వ జయంతి .. కాంగ్రెస్ నేతల నివాళి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 106 వ జయంతి సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ అగ్రనేతలు నివాళి అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సిపిపి ఛైర్‌పర్మన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు శక్తిస్థల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇందిరాగాంధీతో తన చిన్ననాటి ఫోటోలను ఎక్స్ పోస్ట్‌లో రాహుల్ ప్రదర్శించారు. “దేశానికి, ప్రజలకు ఇందిర గొప్ప నాయకురాలు. కానీ నాకు మాత్రం బామ్మ, నా అధ్యాపకురాలు” అని రాహుల్ తన భావోద్వేగం వెల్లడించారు. “దేశానికి, ప్రజలకు అంకితం కావాలని మీరు చెప్పే మానవతా విలువలు,

నా ప్రతి అడుగుకు శక్తిని అందించాయి. అవే నా ఆలోచనలకు బలాన్ని చేకూర్చాయి”అని రాహుల్ తన పోస్ట్‌లో హిందీలో వెల్లడించారు. సఫ్దర్ జంగ్ రోడ్ లోని ఇందిరాగాంధీ మెమోరియల్‌లో జరిగిన స్మారక కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ బాల్యం నుంచి ఆమె జీవిత విశేషాలు, ఆమె సాధించిన విజయాలు ఫోటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కూడా ఇందిరాగాంధీ చిత్తరువుకు ఖర్గే, సోనియా తదితర నేతలు పుష్పాంజలి ఘటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News