Wednesday, January 22, 2025

ఆరు గ్యారెంటీ స్కీమ్ ల అమలులో కాంగ్రెస్ నేతలది కీలక భూమిక

- Advertisement -
- Advertisement -

మాజీ  టిపిసిసి అధ్యక్షులు వి. హనుమంతరావు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల స్కీమ్‌ల అమలులో కాంగ్రెస్ నేతలది కీలక భూమిక అని ఆ పార్టీ మాజీ టిపిసిసి అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో సమావేశమయ్యారన్నారు. రాష్ట్ర కాబినెట్ ఏక తాటిపైకి వచ్చి ఈ నెల 28న కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్బంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు.

గత తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చూడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ 6 గ్యారెంటీ స్కీమ్ లను ప్రజలకు అందించడంలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పథకాలను అందించడంలో నాయకులు పాల్గొంటే మీ నాయకత్వం కూడా బలపడుతుందని విహెచ్ సూచించారు.

ఈ నెల 28 నుండి వచ్చే నెల 6 తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండి తెల్ల రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ఆరు గ్యారెంటీ స్కీమ్ లను ప్రజలకు అందేలా చూడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. నిరక్ష్యరాస్యులైన ప్రజలకు ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను అందించేలా ప్రతి కార్యకర్త పాటుపడాలన్నారు. ప్రజలతో ఉంటే రాజకీయంగా అగ్ర స్థానంలో ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. క్రిస్మస్ పండుగ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన క్రిస్మస్ కానుకలను ప్రజలకు అందించడంలో పార్టీ నాయకులు ముందుండాలని విహెచ్ కోరారు. రెజిలింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్ తీసుకున్న నిర్ణయం, చేసిన పోరాటం… క్రీడా రంగంలో మహిళల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News