Wednesday, January 22, 2025

కాంగ్రెస్ నాయకులకు మంచి బుద్ది రావాలి

- Advertisement -
- Advertisement -

జూలపల్లి: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులకు దేవుడు ఇప్పటికైనా మంచి బుద్ది ప్రసాదించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో జూలపల్లి, కుమ్మరికుంట, కోనరావుపేట, అబ్బాపూర్ గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పి, ముక్కు భూమికి రాయాలన్నారు. మూడు పంటలకు నీళ్లు ఇస్తుంటే, మూడు గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడటం వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు.

రైతులను గోస పెట్టే కాంగ్రెస్ వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ వాళ్లు ఊరిలోకి వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలోనే నాలుగున్నర లక్షల కోట్లను ఖర్చు చేసి సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు.మూడు పంటల తెలంగాణ కావాలో… మూడు గంటల కాంగ్రెస్ పార్టీ కావాలో రైతులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్ కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి రాంగోపాల్ రెడ్డి, మండల పార్టీ గౌరవ అధ్యక్షుడు కంది చొక్కారెడ్డి, వైస్‌ఎంపీపీ మొగురం రమేష్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, అనుబంద సంఘాల అధ్యక్షులు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, కరాటే లక్ష్మణ్, కన్వీనర్ కుంట రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్‌లు మహంకాళి తిరుపతి, శకుంతల రవీందర్, కుంటూరి రాజయ్య, మేచినేని సంతోష్ రావు, బంటు ఎల్లయ్య, సొల్లు పద్మశ్యామ్, పద్మ బుచ్చయ్య, మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షులు పొలగాని సతీష్, రాజేశ్వర్ రెడ్డి, రైతు సమితి గ్రామాల కోఆర్డినేటర్లు పొట్యాల మల్లేశం, నాడెం మల్లారెడ్డి, లోక రవీందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News