Monday, January 20, 2025

బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. 30 ఏళ్లుగా చెన్నారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న 25 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో చేరాయి. వీరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరడం జరిగిదన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, మండల యూత్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి, గ్రామ సర్పంచ్ కుండె మల్లయ్య, క్లస్టర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News