- Advertisement -
నారాయణఖేడ్ టౌన్: సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్‌గాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ గైనిసాయిలు, జంగపల రాములు, పెద్దోళ్ల దావీదు, ఆరే శివాజీరావు, జంగపల నారాయణ, అనిల్, మాల శ్రీను, మాల అనిల్, మాల రాములు, మాల లక్ష్మణ్ వారి కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండూవా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాములు, గ్రామ పార్టీ అధ్యక్షులు విఠల్‌రెడ్డి, నాయకులు వెంకట్, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -