Wednesday, January 22, 2025

కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులామ్ గిరీ చేస్తుండ్రు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, కెటిఆర్ అన్నారు. చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సి న పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిక ప్రాంతమైతే అభివృద్ధి ఆగిపోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు డిల్లీకి గులామ్ గిరీ చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని తొలగించాలని మోడీ ప్రభుత్వం కుట్ర అన్నారు. బిజెపితో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రస్ ప్రభుత్వాలను బిజెపి పడగొట్టిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చేశారని ఆయన తెలిపారు. మా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిందన్నారు. తెలంగాణలో బిజెపి ఆటలు సాగలేదని పేర్కొన్నారు. రాష్ట్రరాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తోందని ఆయన పేర్కొన్నారు. మోడీతో పోరాటం రాహుల్ గాంధీ వల్ల కాదని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News