Thursday, January 23, 2025

కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడ్డారు: మాణిక్ రావు ఠాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడ్డారని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పిఎసి తొలి భేటీ జరిగింది. పిఎసి భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ విధానాలు, హామీలను ప్రజలు విశ్వసించారని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మంచి విజయం కల్పించారని మాణిక్ రావు కొనియాడారు. పార్లమెంటు ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్నారు. మంచి విజయాలు అందేలా కష్టపడి పని చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News