బెంగళూరు : బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఓ వంటగ్యాస్ సిలిండర్‌కు మంగళవారం పూజలు చేసి హారతి ఇచ్చారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు సిలిండర్‌కు పూజ చేయాలని పిలుపునిచ్చారు. ఈ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. “ ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేయండి” అని గతంలో ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను వాయిస్ ఓవర్‌లో వినిపించారు.
శివకుమార్ తన ట్వీట్‌లో “ గతంలో మోడీ ఏం చెప్పారో చూడండి. ఆయన చెప్పినవే నేను చెబుతున్నాను . సోదర సోదరీమణులారా … వంటగ్యాస్ సిలిండర్ రూ. 445 నుంచి రూ.1200 అయింది. మన ప్రధాని కోరిక మేరకు మీరు మీ ఓటు వేయండి. గ్యాస్ సిలిండర్ మీద పూలదండ వేయండి.” అని పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ నేతలు వంటగ్యాస్ సిలిండర్‌ను పూజించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపి తేజస్విసూర్య పేర్కొన్నారు. వారు ఏదో ఒక దాన్ని పూజించడం స్వాగతించదగిందేనని వ్యాఖ్యానించారు. బజరంగబలి దేవాలయాలను సందర్శించడం, వంటగ్యాస్ సిలిండర్లలో దేవుడిని చూడడం మంచిదేనని పేర్కొన్నారు. ప్రతి దాని లోనూ దేవుడు ఉన్నాడని హిందూ ధర్మం చెబుతోందన్నారు. కాంగ్రెస్ ఏదో ఒక పూజ చేస్తుండడం తమకు సంతోషం ఇస్తోందన్నారు.
Kannadigas!
Before you go to cast your vote, don't forget to perform this ritual.
Watch the video
pic.twitter.com/Vl9XM7rPSm
— Congress (@INCIndia) May 10, 2023