Tuesday, January 21, 2025

వంద మంది మోడీలు, షాలొచ్చినా.. బిజెపి ఓటమి ఖాయం

- Advertisement -
- Advertisement -

వంద మంది మోడీలు, షాలొచ్చినా.. బిజెపి ఓటమి ఖాయం
కేంద్రంలో 2024లో విపక్ష ప్రభుత్వమే
ప్రతిపక్ష ఐక్యతకు కీలక సంప్రదింపులు
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఓటమి ఖాయమని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. వంద మంది మోడీలు, అమిత్ షాలు వచ్చినా జరిగేది ఇదేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ సారధ్యపు కూటమి చేతిలో బిజెపి దెబ్బతింటుందని, ఈ దిశలో తమ పార్టీ ప్రతి ఇతర పార్టీలతో తగు రీతిలో సంప్రదింపులు జరుపుతోందని, బిజెపి అధికార చ్యుతిని వాస్తవం చేసేందుకు తగు ప్రక్రియ సాగుతోందని తెలిపారు. నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల సభలో బుధవారం ఖర్గే మాట్లాడారు.

ప్రధాని మోడీ పలు సార్లు తనకు తాను తానొక్కడినే దేశానికి దిక్కు అని చెపుతూ వస్తున్నారని, ఏ ఇతర వ్యక్తులు లేదా నేతలు తన దరిదాపుల్లోకి కూడా రాలేరని చెపుతున్నారని, అయితే ప్రజస్వామిక వ్యక్తి ఎవరూ కూడా ఈ విధంగా మాట్లాడరని స్పష్టం చేశారు. ప్రజాస్వామిక ప్రక్రియలో ఉన్నామని మోడీ గుర్తుంచుకుంటే మంచిదని చెప్పారు. నియంత అయితేనే ఈ విధంగా గొప్పలకు పోతారని వ్యాఖ్యానించారు. నువ్వు నియంతవు కావని, నిన్ను ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలు అవసరం అనుకుంటే ఎవరినైనా దించివేయగలరు, ఎవరినైనా పదవికి తీసుకురాగలరని ఖర్గే చెప్పారు.

వచ్చే ఏడాది కేంద్రంలో విపక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. బిజెపికి సరైన మెజార్టీ రాదు. ఇతర పార్టీలు కలిసికట్టుగా వ్యవహరించి అధికార స్థాపనకు అవసరం అయిన బలాన్ని సంతరించుకుంటాయని తెలిపారు. తిరిగి అధికారం కోసం మోడీ, షాల ద్వయాలు ఎన్ని యత్నాలకు దిగినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. దేశం స్వాతంత్య్రం కోసం ఆ తరువాత కూడా కాంగ్రెస్ నేతలు తమ ప్రాణాలను అర్పించారని, దేశం గురించి మాట్లాడే బిజెపి నేతలకు ఇటువంటి చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News