Monday, December 23, 2024

25 తర్వాతే కాంగ్రెస్ జాబితా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా మరింత ఆలస్యం కానుంది. దసరా పండుగ తర్వాతే స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఫైనల్ చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో కేసి వేణుగోపాల్ నివాసంలో శనివారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో సెంట్ర ల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఎంపి ఉత్తమ్ కుమార్, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రెండోవిడత అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఈ సమావేశంలో పలువురు తమ సలహాలు, సూచనలు తెలిపినట్టుగా సమాచారం. సమావేశం అనంతరం థాక్రే, రేవంత్, భట్టి, ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.25 తర్వాతే మలి జాబితా వెల్లడిస్తామని చెప్పారు. బిసిలకు తప్పకుండా ప్రాధాన్య లభిస్తుందని థాక్రే పేర్కొన్నారు.
జాబితా ప్రకటన తరువాత సిగపట్లు తప్పవా..?
అయితే రెండోవిడతలోనే మిగతా స్థానాల అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం భావించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడడం లేదని తెలుస్తోం ది. ఈ నేపథ్యంలోనే రెండోవిడతలో 30 మందితో కూడిన జాబితాను ప్రకటించి మిగిలిన అభ్యర్థుల పేర్లను తర్వాత వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మొదటివిడతలో పేర్లు లేని అభ్యర్థుల పేర్లను రెండోజాబితాలో ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జాబితా విడుదలపై పార్టీ లీడర్లతో పాటు కేడర్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మొదటి జాబితా విడుదల తర్వాతతో పోల్చితే రెండో జాబితా తర్వాత అసంతృప్తి గళాలు ఎక్కువయ్యే అవకాశశాలున్నాయి. ఈ లిస్టులోని సెగ్మెంట్లకు దాదాపు ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతుండడం, ఈ నేపథ్యంలో టిక్కెట్ల ప్రకటన తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.
జానారెడ్డి టీమ్ అలర్ట్ ..
అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు జానారెడ్డి టీమ్ శనివారం నుంచే రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. కమ్యూనిస్టులకు వదిలేసిన సీట్లలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ఒక్కో నియోజకవర్గం నుం చి పోటీలో ఉన్న ఇద్దరు ప్రధాన ఆశావహులతో భేటీ కానున్నట్లు తెలిసింది. శనివారం ఉద యం ఈటీమ్‌కు టిక్కెట్ రాని నేతల వివరాలు అందడంతో ఈబృందం ఇప్పటికే రంగంలోకి దిగినట్టుగా సమాచారం.
ఢిల్లీకి క్యూ కట్టిన ఆశావహులు
ఫేక్ జాబితాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భయం పట్టు కుంది. 14 మందితో రెండో జాబితా విడుదల అయ్యిదం టూ వార్త వైరల్ కావడంతో శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఆరు పేర్లతో మరో జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మొదటి 14 పేర్లలో మహేశ్వరం ఒకరి పేరు. రెండో జాబితాలో ఇంకో పేరు ఉండటంతో కాంగ్రెస్ కేడర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను మరికొంద మంది నాయకులు ఆశావహులు కలుస్తున్నారు. దీంతో ఆఖరి ప్రయత్నాలను వారు కొనసాగి స్తున్నారు. నిజంగానే 14 మందితో జాబితా విడుదల చేశా రా? అనే అనుమానాలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీ శ్రేణులు అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఇలాం టి ఫేక్ జాబితాలను ఎవరు సృష్టిస్తున్నారు? ఈ వార్తలపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం కోసం హస్తం నేతలు వేచి చూస్తున్నారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో 119 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో 55 మందికి చోటు కల్పించింది. ఈ నేపథ్యంలోనే రెండో జాబితా అంటూ ఫేక్ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ ఫేక్ న్యూస్‌పై టిపిసిసి నాయకులు సైతం ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News