Monday, January 20, 2025

చత్తీస్‌గఢ్‌లో 30మందితో కాంగ్రెస్ జాబితా

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్‌లో 30 మందితో కాంగ్రెస్ జాబితా
సిఎం బాఘెల్, డిప్యూటీ సిఎం సింగ్‌దేవ్‌కు చోటు

రాయపూర్: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు 30 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, ఉపముఖ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్ పేర్లు కూడా ఉన్నాయి. భూపేశ్ బాఘెల్ పఠాన్ స్థానంనుంచి, సింగ్‌దేవ్ అంబికాపూర్ స్థానంనుంచి బరిలో దిగనున్నారు. పఠాన్‌లో ఆయన తన మేనల్లుడు, బిజెపి నేత విజయ్ బాఘెల్‌తో తలపడతారు. జాబితాలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ 22 మంది సిట్టింగ్ ఎంఎల్‌ఎలకు తిరిగి టికెట్లు ఇచ్చింది.

అయితే వివిధ కారణాలతో 8 మందికి టికెట్లు నిరాకరించింది. జాబితాల అసెంబ్లీ స్పీకర్ చరణ్‌దాస్ మహంత్, పిసిసి అధ్యక్షుడు, ఎంపి దీపక్ బైజ్ పేర్లు కూడా ఉన్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చే నెల 7, 17 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న 20 స్థానాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ఈ రోజు ప్రకటించామని, జగదల్‌పూర్ స్థానానికి కూడా ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థిని ప్రకటిస్తామని బైజ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News