బెంగళూరు: ఉగ్రవాదానికి బిజెపి ఎవరినీ కోల్పోలేదు. కాంగ్రెస్ మాత్రం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను కోల్పోయిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం అన్నారు. ఆయన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ ఆది నుంచే పోరాడుతోందన్నారు.
‘నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారు. నెహ్రూ కారణంగానే ఇండియాలో ప్రజాస్వామ్యం విజయవంతం అయింది. ప్రజాస్వామ్య పునాదులను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసింది’ అని సిద్ధరామయ్య తెలిపారు.
‘ప్రతిపక్షం ఎల్లప్పుడూ నిజాయితీగా పనిచేయాలని నెహ్రూ కోరుకున్నారు. నెహ్రూకు ఇప్పటి ప్రధాని మోడీకి పొంతనే లేదు. దేశ సమగ్రతను కాపాడ్డంలో కాంగ్రెస్ ముందుంది. రాజీవ్ గాంధీ అధికారాన్ని వికేంద్రీకరించారు’ అన్నారు.
‘కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమైంది’ అని మాజీ ముఖ్యమంత్రి బొమ్మై అనదానిపై ‘వచ్చే కేబినెట్ సమావేశం నాటికి అన్ని గ్యారంటీలను నెరవేరుస్తాం’ అన్నారు సిద్ధరామయ్య.
‘బొమ్మై, ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారంటీలను నెరవేరుస్తాం. మేము ఇదివరకు కూడా మా మాట నిలుపుకున్నాం. భవిష్యత్తులో కూడా మాట నిలుపుకుంటాం. ఇదే బిజెపికి, కాంగ్రెస్‌కు ఉన్న తేడా. బిజెపి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిదంటూ ఏమీ లేదు. ఎలాంటి అభివృద్ధిని బిజెపి సాధించలేదు’ అని సిద్ధరామయ్య ఆరోపించారు.
#WATCH | Karnataka CM Siddaramaiah and Dy CM DK Shivakumar pay tribute to former PM Rajiv Gandhi on his 32nd death anniversary, in the KPCC office in Bengaluru pic.twitter.com/Dfn87Dyeop
— ANI (@ANI) May 21, 2023