Monday, December 23, 2024

మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మేనిఫెస్టో మేలు చేస్తుందని టిపిసిసి ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ భవిష్యత్ ఉందని, తెలంగాణ సమాజానికి అవసరమైన అన్ని అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని వివరించారు. మేనిఫెస్టోలు కీలక అంశాలను పొందుపరిచామని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టామని రేవంత్ పేర్కొన్నారు. నాలుగు నెలల జాబ్ క్యాలెండర్ ముందే ప్రకటించిందని స్పష్టం చేశారు. శ్రీధర్ బాబు కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ మేనిఫెస్టో రూపొందించిందన్నారు. మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని రేవంత్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News