హైదరాబాద్: కాసేపట్లో సిఎల్‌పి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని సిఎల్‌పి ఎన్నుకోనుంది. సిఎల్‌పి సమావేశం తరువాతే కాంగ్రెస్ నిర్ణయం వెల్లడించనుంది. ఎఐసిసి పరిశీలకుల సమక్షంలో సిఎల్‌పి నేత ఎంపిక ఉంటుంది. సిఎల్‌పి నేత ఎంపిక తరువాత కాంగ్రెస్ బృందం కలవనుంది. ఇవాళ సిఎం ఒకరిద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్‌భవన్‌లో సౌకర్యాల గురించి కాంగ్రెస్ నాయకత్వం ఆరా తీయనుంది. 300 మంది వరకు పాల్గొనే సౌకర్యాలు ఉన్నట్లు కాంగ్రెస్ తెలుసుకుంది. సిఎల్‌పి నేత ఎంపికకు ఎఐసిసి పరిశీలకుల ఎంఎల్‌ఎల అభిప్రాయ సేకరణ జరిగింది. ఎంపిక పూర్తవగానే నివేదికను పరిశీలకులు అధిష్టానానికి పంపనున్నారు. ఎఐసిసి నిర్ణయం మేరకు ఈ నెల 6 లేదా 9న మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయోత్సవ సభగా నిర్వహించే యోచనలో ఉంది.
కాసేపట్లో సిఎల్‌పి సమావేశం…..
- Advertisement -
- Advertisement -
- Advertisement -