Monday, December 23, 2024

టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ మైనారిటీ నేతలు

- Advertisement -
- Advertisement -
మైనారిటీల సంక్షేమం నా ధ్యేయం: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్ : ఆర్మూర్ నియోజక వర్గంలోని నందిపేట మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖలీం అహ్మద్ నాయకత్వంలో వందలాది మంది టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పియూసి చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి‚ జీవన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి టిఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మైనారిటీ నేతలు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్ల ఆకర్షితులమై టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌లో చేరిన మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. తమ ప్రభుత్వం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యుడు ఎర్రం యమునా ముత్యం, ఎంపిపి అధ్యక్షుడు వాకిడి సంతోష్‌రెడ్డి, ఎంపిపి ఉపాధ్యక్షుడు దేవేందర్, ఉప సర్పంచ్ కొత్తూరు భరత్, ఎంపిటిసి సభ్యుడు బజ్జూ, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉస్సేన్, రఫీక్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News