Sunday, January 19, 2025

నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అరెస్టు

- Advertisement -
- Advertisement -

గుర్‌గ్రామ్/ చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ మమ్మన్ ఖాన్‌ను పోలీసులు తఆజాగా అరెస్టు చేశారు. జులై 31నహిందూ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో నుహ్‌లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిపిందే. యాత్ర అనంతరం చెలరేగిన అల్లర్లలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ హస్తం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి సమయంలో ఎంఎల్‌ఎను అదుపులోకి తీసుకున్నట్లు ఫిరోజఖపూర్ జిర్ఖా డిఎస్‌పి సతీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. అన్ని సాక్షాధారాలను పరిశీలించిన అనంతరమే ఎంఎల్‌ఎను నిందితుడిగా చేర్చినట్లు హర్యానా పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఫోన్ కాల్ రికార్డులు,ఇతర ఆధారాలు తమవద్ద ఉన్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా ఇంతకు ముందు విచారణకు హాజరు కావాలని నుహ్ పోలీసులు ఎంఎల్‌ఎకు రెండు సార్లు సమన్లు పంపించారు. అయితే ఆయన ఇతర కారణాలు చెప్పి విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎను తాజాగా అరెస్టు చేశారు.

మమ్మన్ ఖాన్ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్ జిర్కా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన అరెస్టును ముందు ఊహించిన ఎంఎల్‌ఎ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు పంజాబ్‌హర్యానా హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. హింస చెలరేగిన రోజున తాను నుహ్‌లో లేనని, తనను అన్యాయంగా కేసులో ఇరికించారి పిటిషన్‌లో మమ్మన్ ఖాన్ పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ బెయిలు పిటిషన్‌పై ఈ నెల 19న హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నుహ్ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించినట్లు నుహ్ అసిస్టెంట్ పోలీసు సూపరింటెండుంట్ ఉషా కుందు చెప్పారు. మరో వైపు సోషల్ మీడియాలో తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టడం కోసం జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్‌ఎంఎస్ సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ టివిఎస్‌ఎన్ ప్రసాద్ ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. నుహ్ జిల్లాలో ఈ నిషేధం ఈ నెల 15నుంచి 16వ తేదీ అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గత జులై 31న విశ్వ హిందూ పరిషత్ మత ఊరేగింపు సందర్భంగా నుహ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి.గురుగ్రామ్‌లోని బాద్షాపూర్‌లో ఓ రెస్టారెంట్‌తో పాటుగా 14 దుకాణాలకును ధ్వంసం చేవారు. సెక్టార్ 66 పరిధిలో ఏడు దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ ల్లర్లలో ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 100 మందికి పైగా అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News