- Advertisement -
గాంధీనగర్: రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు, పాటిదార్ సామాజిక వర్గ నాయకుడు హర్షద్ రిబాదియా గురువారం అధికార బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రిబాదియా కాషాయ కండువా కప్పుకున్నారు. గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింహ్ వాఘేలా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జునాగఢ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మెహసానా తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు, కిసాన్ మోర్చా నాయకులు కూడా బిజెపిలో చేరారు. ఈ ఏడాది చివరిలో బిజెపి పాలిత గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రిబాదియా మంగళవారం అసెంబ్లీ స్పీకర్ నిమాబెన్ ఆచార్యకు తన రాజీనామా లేఖను సమర్పించారు.
Congress MLA Harshad Ribadiya joins BJP
- Advertisement -