Thursday, January 23, 2025

నేనే సిఎం.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీల్లో ముఖ్యమంత్రి రేసులో చాలా మంది ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికల వేళ వివిధ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారే పదునైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నిస్తూ నెట్టింట్లో నిలుస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిని అని బహిరంగంగా ప్రకటించారు.

సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జగ్గారెడ్డి మాట్లాడుతూ….. ఇప్పటి వరకు సంగారెడ్డి ప్రజలను తన కడుపులో పెట్టుకుని కాపాడానని, ప్రజల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తుచేసుకున్నారు. దసరా పండుగ నాడు తన మనసులోని మాటలను ప్రజల ముందు పెట్టారు. ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు అయినా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానన్నారు. జగ్గారెడ్డి ఫోన్‌లో కూడా అందుబాటులో లేరంటూ ఇటీవల వస్తున్న ఆరోపణపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఫోన్‌లో అందుబాటులో లేకపోయినా తన భార్య, అనుచరులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ జోరు పెరిగిందన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని భావించిన నేతలు కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలిస్తే తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని జానారెడ్డి ఆశిస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News