Sunday, December 22, 2024

కాంగ్రెస్ ఎంఎల్ఎకు 7 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కారాగార శిక్షతోపాటు భారీ జరిమానాలు విధించింది. 2009-10 కాలంలో నుంచి సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని బెలెకేరి పోర్టు నుంచి చోరీ చేయడంతోపాటు చట్టవిరుద్ధంగా విదేశాలకు ఎగుమతి చేసినందుకు సతీష్ కృష్ణకు ప్రత్యేక కోర్టు ఈ విక్షలు విధిస్తూ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు అక్టోబర్ 24న తీర్పు వెలువరించింది. కన్వర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 58 ఏళ్ల సతీష్ కృష్ణతోపాటు మరో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. కారాగార శిక్ష విధఙంపుతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సతీష్ కృష్ణ శాసనసభ్యత్వం కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సతీష్ కృషన్ణు చోరీ, నేరపూరిత కుట్ర, మోసం వంటి అభియోగాలలో దోషిగా కోర్టు తేల్చింది.

బళ్లారిలో అక్రమంగా తవ్వకాలు జరిపిన కోట్లాది రూపాయల విలువైన ఇనుస ఖనిజాన్ని 2010లో బెలెకేరి పోర్టులో నిల్వ చేశారు. అయితే అధికారులతో కుమ్మకైన సతీష్ కృష్ణ దీన్ని చైనాకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో జైలు శిక్షలు పొందిన ఇతర నిందితులలో పోర్టు డిప్యుటీ కన్జర్వేటర్ మహేష్ జె బిలియే, అషాపుర మిఏచెమ్, ఎండి చేతన్ షా, కెవి నాగరాజ్ అలియాస్ స్వస్తిక్ నాగరాజ్, కెవిఎన్ గోవిందరాజ్, వెంటకేశ్వర మినరల్స్ భాగస్వామి కరపూడి మహేష్ కుమార్, లాల్ మహల్ లిమిటెడ్ ఎండి ప్రేమ్ చంద్ గర్గ్ ఉన్నారు. కాగా..తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు ఇతర నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోసి స్పందిస్తూ దోషిగా తేలినందున ఎమ్మెల్యే సతీష్ కృష్ణను అనర్హుడిగా ప్రకటించాలని కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News