Monday, January 20, 2025

ఆ మాటతో బాధ పడి రాజీనామా చేశా: సీతక్క

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలను అధిష్టానం పరిష్కరిస్తుందని ఎంఎల్‌ఎ సీతక్క ధీమా వ్యక్తం చేశారు. అందరూ నేతలు కూడా ఒక్క అడుగు తగ్గి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం సీనియర్లు పనిచేస్తున్నారని, తాము కూడా ఐదారేళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. అందరం ఈగోలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. తాను రేవంత్ రెడ్డి మనిషిని అయితే.. సిఎల్‌పి నేత చెప్పిన పనులు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. అసెంబ్లీలో సిఎల్‌పి నేత చెప్పినట్టుగానే వ్యవహరించామని చెప్పారు.

పార్టీలో తన వంతు పాత్రను తాను పోషిస్తానని చెప్పారు. పాతోళ్లు, కొత్తోళ్లు ఎవరిదైనా తప్పు ఉంటే మాత్రం వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. వలస వాదులు అనే మాట బాధ అనిపించిందని అన్నారు. తాము కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్పారు. వలస వాదులు అనే పదానికి మాత్రమే తాను బాధపడి రాజీనామా చేసినట్టుగా చెప్పారు. పార్టీని ఇబ్బంది పెట్టాలని, సీనియర్లను బద్నాం చేయాలని పదవులకు రాజీనామా చేయలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News