Monday, December 23, 2024

ఎంఎల్‌ఎ భార్య ఫోన్‌ కొట్టేశాడు… దొరికిపోయాడు

- Advertisement -
- Advertisement -

సూరత్: పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ భార్య ఫోన్‌ను దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. పోలీసులు దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఖేద్‌బ్రహ్మ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ డా తుషార్ చౌదరీ భార్య డాక్టర్ దీప్తీ తుషార్ చౌదరీ ఎస్‌ఎంఐఎంఆర్ ఆ్సస్పత్రిలో ఫిజియోథెరిపిస్ట్‌గా సేవలందిస్తున్నారు. జూన్ 25న పనాస్ నుంచి కింగ్ కార్నర్‌కు డా దీప్తీ చౌదరీ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఆమె ఫోన్‌ను సౌరభ్ ముంద్రా(27) లాక్కొని వెళ్లిపోయాడు. ఆమె వెసూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్మార్ట్ ఫోన్ విలువ దాదాపుగా రూ.60 వేలు ఉంటుందని వెల్లడించింది. సిసి కెమెరాల ఆధారంగా గుర్తించి సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సౌరభ్ ఫోన్‌ను దొంగలించడం ఇదే మొదటి సారి. పోన్‌ను దొంగతనం చేసినప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కు తరలించారు.

Also Read: మహిళా డ్రైవర్‌కు ఉద్వాసన..కారు కొనిచ్చిన కమల్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News