Monday, December 23, 2024

కాంగ్రెస్ ఎంఎల్‌సి అభ్యర్థులు అద్దంకి, బల్మూరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి అభ్యర్థులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఇద్దరికి పార్టీ అధిష్ఠానం సమాచారం ఇచ్చింది. వారికి ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని తెలిపింది. ఈ నెల 18తో నామినేషన్ల గడువు ముగుస్తుండగా 29న పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా కాంగ్రెస్ పార్టీకే ఆ రెండు సీట్లు వస్తాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News