Sunday, December 22, 2024

కాంగ్రెస్ లో చేరి నా అనుచరుడిని చంపేశారు: ఖర్గే, రాహుల్కు జీవన్ రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నానని, లేఖ రాస్తున్నందుకు తాను విచారిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలకంగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పదేళ్లు బీఆర్ఎస్‌ దుర్మార్గాలపై పోరాడానని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే.. తన అనుచరుడిని కిరాతకంగా చంపేశాడని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News